ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది.  మరి ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ వార్త ట్రెండ్ అవుతూ అభిమానులకి స్పెషల్ క్రేజీ ఫీలింగ్ కలుగజేసింది . దీంతో అందరు ఈ వార్త పై  స్పెషల్ ఫోకస్ చేశారు. అయితే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు గతంలో ఎప్పుడు ఈ విధంగా నిర్ణయం తీసుకోలేదు కదా  తారక్ ..? అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకునే స్థాయికి ఈ వార్త వెళ్లిపోయింది అంటే ఈ మేటర్ లో ఎంత హీట్ ఉందో అర్థం చేసుకోవచ్చు.


మనకు తెలిసిందే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాకి కమిటీ అయ్యి దాదాపు రెండేళ్లు పైనే అవుతుంది . కానీ ఈ సినిమా రీసెంట్ గానే సెట్స్ పైకి వచ్చింది . తాజాగానే తారక్సినిమా సెట్స్ లో పాల్గొన్నాడు అంటూ కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ తో తారక్ రొమాన్స్ చేయబోతున్నాడు అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది .



ఆల్రెడీ ఈ సినిమాలో రుక్మిణి వసంత్ అఫీషియల్ గా కన్ఫామ్ అయిపోయింది . అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఇంకా మిగిలి ఉన్నారు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . వాళ్ల ని చూస్ చేసుకునే ఆప్షన్ పూర్తిగా తారక్ కే ఇచ్చేసారట ప్రశాంత్ నీల్. అయితే ఏ స్టార్ హీరో అయినా సరే డైరెక్టర్స్ ఈ విధంగా ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే ఏ పాన్ ఇండియా బ్యూటీలనో.. బాగా క్రేజ్ ఉండి హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే హీరోయిన్ లని చూస్ చేసుకుంటారు .కానీ తారక్ మాత్రం ఆ ఇద్దరి స్థానంలోకి శృతిహాసన్ అలాగే యంగ్ బ్యూటీ మమిత బైజును సెలెక్ట్ చేసుకున్నాడు.



శృతిహాసన్ కు ఇప్పుడు పెద్ద క్రేజ్ లేదు ఫామ్ లో కూడా లేదు. అది అందరికీ తెలిసిందే . మమిత ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటుంది .  శృతిహాసన్ - మమిత ఇద్దరికీ అసలు ఈ పాన్ ఇండియా సినిమాలో అవకాశము అందుకునే స్టేటస్ లేదు కానీ తారక్ మాత్రం వాళ్ళిద్దరి పేర్లని చూస్ చేసుకోవడానికి ప్రత్యేక కారణం ఉంది అంటున్నారు జనాలు.  ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు పేరు పలుకుబడి ఉన్న స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్స్ ని తమ సినిమాలో స్టార్ లీడ్ పాత్రలో చూపిస్తున్నారు అని ..తారక్  కూడా అదే విధంగా చేస్తే మిగతా హీరోలకి తారక్ కి స్పెషాలిటీ ఏముంటుంది అని కొంతమంది కూసింత ఘాటుగానే కౌంటర్స్ వేశారు.



బహుశా తారక్ అవి విన్నట్టు ఉన్నాడు.  అందుకే ఇలా ఫేడ్ అవుట్ అయిపోయిన బ్యూటీ ఇప్పుడిప్పుడే క్రేజ్ అందుకుంటున్న బ్యూటీ లని తన సినిమాలో హీరోయిన్లుగా చూస్ చేసుకున్నారు . తారక్ పై ఎలాంటి నింద ఉండటం ఆయనకి ఇష్టం లేదు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: