నాచురల్ స్టార్ నాని హీరోగా హీరోయిన్గా శ్రీనిధి శెట్టి కాంబినేషన్లో వస్తున్న మొట్టమొదటి చిత్రం హిట్ 3. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిట్ యూనివర్సిటీ నుంచి వస్తున్న మూడవ సినిమా కావడం చేత ఈ సినిమా పైన భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో నిర్మాతగా వ్యవహరించిన నాని ఈ చిత్రానికి కూడా తానే సొంతంగా హీరోగా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాల లో కంటే యూఎస్ఏ మార్కెట్లో సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టే విధంగా ప్రీమియర్ షో సత్తా చాటుతున్నట్లు తెలుస్తోంది.


ఇదే సత్తా యూఎస్ఏ మార్కెట్లో కొనసాగిస్తే హిట్ 3 కూడా ఊచకోత గట్టిగానే కోస్తుందని అభిమానులు తెలియజేస్తున్నారు. ఒక నార్త్ అమెరికా మార్కెట్ లోనే ఈ సినిమా ఆఫ్ మిలియన్ మార్కు దగ్గరలోకి చేరిపోయిందట. దీంతో నాని కెరియర్ లోనే  ఆల్ టైం అత్యధికంగా హైయెస్ట్ ఫాస్టెస్ట్ మార్క్ దాటిన చిత్రంగా హిట్ 3 సినిమా నిలవబోతోంది. మొత్తానికి అర్జున్ సర్కార్ పాత్రలో నాని మాత్రం రాంపేజ్ ఆడిస్తున్నారని చెప్పవచ్చు.మే ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది.


ఇక యూఎస్ఏ లో సినిమా సక్సెస్ తో కలెక్షన్స్ తో భారీగా దూసుకుపోతోంది. మరి రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ విధంగా ఉంటుందన్నది మే ఒకటవ తేదీన తెలియబోతోంది. తెలుగు రాష్ట్రాలలో పాజిటివ్ రివ్యూస్ గనుక వస్తే కచ్చితంగా హిట్ 3 సినిమా కలెక్షన్స్ పరంగా భారీగా రాబడుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి అసలు విషయం ఏంటన్నది రేపటి రోజున తెలియబోతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు కూడా సినిమా టికెట్ ధరలను అధికంగా పెంచుకునేందుకు వెలుసుబాటు కల్పించింది మరి మొదటి రోజు నాని కెరియర్ లోనే అత్యధికంగా కలెక్షన్స్ హిట్ 3 రాబడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: