న్యాచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన హిట్3 మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తొలిరోజే ఏకంగా 43 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. మేకర్స్ నుంచి అధికారికంగా ఈ మేరకు ప్రకటన వెలువడింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తుండటం గమనార్హం.
 
హిట్ ఫ్రాంఛైజీలో భాగంగా మూడో సినిమాగా ఈ సినిమా తెరకెక్కగా నాని కెరీర్ లో గతంలో ఏ సినిమా సాధించని స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధించడం హాట్ టాపిక్ అవుతోంది. హిట్3 మూవీ సంచలనాలు రాబోయే రోజుల్లో కూడా కొనసాగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. గురువారం రోజున థియేటర్లలో విడుదల కావడంతో లాంగ్ వీకెండ్ ను ఈ సినిమా సద్వినియోగం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
 
హిట్3 సినిమా దర్శకుడిగా శైలేష్ కొలనుకు సైతం మంచి పేరును తెచ్చిపెట్టింది. హిట్3 సినిమా ఫస్టాఫ్ కొంతమందికి నచ్చితే సెకండాఫ్ మరి కొంతమందికి నచ్చింది. హిట్3 సినిమా తొలిరోజే దాదాపుగా 21 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం సంచలనం అవుతోంది. ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
 
హిట్4 సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. కార్తీ హిట్4 సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో అడివి శేష్ సైతం కీలక పాత్రలో కనిపించారు. నాని గత సినిమాలకు భిన్నమైన సినిమాను ఎంచుకోవడం గమనార్హం. నాని రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాని రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉంది. నాని తర్వాత సినిమా ది ప్యారడైజ్ టైటిల్ తో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కుతుండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: