
పుష్ప2 సినిమాతో అయితే నెంబర్ వన్ డైరెక్టర్గా రాజ్యమేలేస్తున్నాడు . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సుకుమార్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కే సినిమాకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ లీక్ అయి వైరల్ గా మారాయి . కాగా ఈ సినిమా అందరూ రంగస్థలం 2 గా తెరకెక్కబోతుంది అనుకుంటున్నారు . కానీ అలా కానే కాదు అంటూ తేలిపోయింది . అంతేకాదు ఈ సినిమా సిస్టర్ బేస్డ్ సెంటిమెంట్గా తెరకెక్కబోతుందట . మరీ ముఖ్యంగా నాన్నకు ప్రేమతో సినిమాలో ఎంత సెంటిమెంట్ చూపించాడో సుకుమార్ అందరికీ తెలిసిందే .
అయితే ఇప్పుడు చరణ్ హీరోగా తెరకెక్కించే సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ను చూపించబోతున్నారట . అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ కి సిస్టర్ గా త్రిష నటించబోతుందట. ఆల్రెడీ చిరంజీవి - త్రిష కాంబోలో స్టాలిన్ మూవీ వచ్చింది . త్వరలోనే విశ్వంభర సినిమా రిలీజ్ కాబోతుంది . ఒక పక్క తండ్రికి హీరోయిన్గా నటించిన అమ్మాయిని సుకుమార్ ఇప్పుడు చరణ్ కి అక్కగా మార్చేసాడు . ఇదేం కాంబో అంటూ జనాలు నవ్వుకుంటున్నారు. కొంతమంది సినిమా ఇండస్ట్రీ అంటే అంతే ఎవరికి ఎప్పుడైనా వారి వరసలు మారిపోతాయి అంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు . కానీ సుకుమార్ ఒక క్రేజీ కాంబో సెట్ చేస్తే మాత్రం దాని వెనక ఏదో బిగ్ రీజన్ ఉంటుంది. త్వరలోనే ఆ రీజన్ బయటపడుతుందని అంటున్నారు జనాలు..!