భారతదేశం అనేక విషయాల్లో అత్యంత గొప్పది అనేది అనేక సార్లు రుజువు అయింది. భారతదేశానికి ఎవరైనా కీడు చేసినా కూడా ఆ కీడును మరిచిపోయి వారు కష్టాల్లో ఉన్నారు అంటే వారికి సహాయం చేయడానికి ముందడుగు వేస్తూ ఉంటుంది. కానీ అలా ముందడుగు వేసి మంచి చేసిన దేశాలు కూడా భారత్ కి చెడు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... టర్కీ దేశానికి భారతదేశం ఎన్నో సహాయాలు చేసింది. కొంత కాలం క్రితం టర్కీ దేశంలో పెద్ద ఎత్తున భూకంపాలు వచ్చాయి. ఆ సమయంలో భారతదేశం అన్ని దేశాల కంటే ముందుండి టర్కీ కి సహాయం చేయడంలో ముందడుగు వేసింది. రెస్క్యూ ఆపరేషన్లలో భారతదేశం ముందుండి పాల్గొనింది.

అలాగే వారికి ఆహారం అందించడంలో కూడా ముందడుగు వేసింది. ఇలా టర్కీ కష్టాల్లో ఉన్నప్పుడు భారతదేశం ఆ దేశానికి ఎంతో సహాయ , సహకారాలను అందించింది. ఇక ఇలా టర్కీ దేశం కోసం , అక్కడి ప్రజల కోసం భారతదేశ ఎంతో సహాయం చేస్తే వారు మాత్రం తిరిగి ఆ సహాయం చేయకపోగా భారతదేశానికి నష్టం కలిగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య ఉధృత పరిస్థితులు నెలకొన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే భారత్ ఆ దేశంలోని కొంతమంది ఉగ్రవాదులపై దాడి చేసి వారిని చంపింది. ఇక పాకిస్తాన్ ఆ దేశ ఉగ్రవాదులపై దాడి చేసినందుకు భారత్ పై దాడి చేస్తుంది.

ఈ దాడిలో భాగంగా పాకిస్థాన్ కి టర్కీ దేశం ఆయుధాలను అందించింది. అలా టర్కీ పంపిన ఆయుధాలతో భారతదేశంపై పాకిస్తాన్ దాడి చేసింది. ఇలా టర్కీ ఎంతో సహాయం చేసిన భారతదేశానికి కీడు చేసే వారికి సహాయం చేస్తూ ఉండడంతో అనేక మంది టర్కీ లాంటి దేశాలకు అస్సలు సహాయం చేయకూడదు అని అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: