టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో శ్రీ విష్ణు ఒకరు. శ్రీ విష్ణు తాజాగా సింగిల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మే 9 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు మంచి ఓపెనింగ్లు లభించాయి. ఆ తర్వాత కూడా ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి భారీ లాభాలను అందుకునే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ విష్ణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఓ సీనియర్ హీరోతో సినిమా చేయబోతున్నాను అని చెప్పుకొచ్చాడు. అసలు విషయం లోకి వెళితే ... తాజా ఇంటర్వ్యూలో భాగంగా శ్రీ విష్ణు కు మీరు వెంకటేష్ గారితో ఓ సినిమా చేయబోతున్నట్లు , ఆ సినిమా కోసం రామ్ అబ్బరాజు ఓ కథను కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది నిజమేనా అనే ప్రశ్న ఎదురయింది. దీనికి శ్రీ విష్ణు సమాధానం చెబుతూ ... అవును నిజమే ... ప్రస్తుతం రామ్ అబ్బరాజు , వెంకటేష్ గారు మరియు నా కోసం ఓ కథను రెడీ చేస్తున్నాడు.

ఆ కథ మొత్తం పూర్తి అయ్యాక అది అద్భుతంగా వచ్చింది అనుకుంటే దానిని వెంకటేష్ గారికి వినిపిస్తాం. ఆయనకు నచ్చితే మా కాంబినేషన్లో సినిమా వస్తుంది. ఒక వేళ రామ్ అబ్బరాజు తయారు చేసిన కథతో కాకపోయినా ఆ తర్వాత ఆయన వెంకటేష్ గారితో ఒక మంచి కథ దొరికితే సినిమా చేయడానికి ప్రయత్నిస్తా అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా శ్రీ విష్ణు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv