టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని గురించే ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రామ్ , వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈయన నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలు సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయనకంటు ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. ఇప్పటివరకు ఎన్నో విజయాలను అందుకున్న రామ్ ఈ మధ్య కాలంలో మాత్రం మంచి విజయాలను అందుకోవడంలో చాలా వెనుకబడిపోయాడు.

వరుసగా రామ్ నటించిన ది వారియర్ , స్కంద , డబల్ ఈస్మార్ట్ మూవీలు భారీ అపజయాలను అందుకున్నాయి. రామ్ ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ దర్శకుడు అయినటువంటి మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటివరకు మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ యొక్క షూటింగ్ను రాపో 22 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ మూవీ టైటిల్ గ్లీమ్స్ వీడియో ను మే 15 వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదల కు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి వరుస అపజయలతో డిలా పడిపోయిన రామ్మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: