
పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా 3 నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో మంగళవారం ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారని తెలుస్తోంది. బంగారం ఎక్కువగా కొంటున్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే ముందున్నా పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని చంద్రబాబు అన్నారు.
ఇతర రాష్ట్రాల్లో రవాణా శాఖ ఆదాయం పెరుగుతుంటే రాష్ట్రంలో ఎందుకు తక్కువగా వస్తుందో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చారు. నెలవారీ లక్ష్యాలు అధిగమించేలా ఆదాయార్జన శాఖలు ప్రయత్నించాలని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తెచ్చి రాష్ట్రంలో విక్రయించకుండా చర్యలు చేపట్టాలని ఆయన కామెంట్లు చేశారు.
రాష్ట్రంలో మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగేలా రియల్ టైమ్ లో ట్రాక్ చేయాలని అన్నారు. రాబడి పెంచుకునే మార్గాలను అన్వేషించాలని కేంద్ర సాయం, అప్పులు ప్రాథమిక దశలో నిలబడేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఒకటి, రెండు శాఖలు ఏడాది కాలంలో అనుకున్నంత పురోగతి సాధించలేదని ఆయన అన్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు