తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఇకపోతే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయనకు వరుసగా హీరోగా సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఇప్పటివరకు అనేక సినిమాల్లో హీరోగా నటించిన విజయ్ దేవరకొండకు చాలా సినిమాల ద్వారా మంచి విజయాలు వచ్చాయి.

ఈ మధ్య కాలంలో మాత్రం విజయ్ నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం విజయ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తో పాటు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే విజయ్ , రాహుల్ కాంబోలో రూపొందబోయే సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన , విజయ్ దేవరకొండ జోడిగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. విజయ్ , రష్మిక కాంబోలో మొదటగా గీత గోవిందం అనే సినిమా వచ్చింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే వీరిద్దరి కాంబోలో ఆఖరుగా డియర్ కామ్రేడ్ అనే సినిమా వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే వీరిద్దరి కాంబోలో రూపొందిన గీత గోవిందం , డియర్ కామ్రేడ్ ఈ రెండు సినిమాల్లో కూడా విజయ్ , రష్మిక కెమిస్ట్రీ కి మాత్రం ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd