హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో అక్షయ్ కుమార్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకుని బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే తాజాగా అక్షయ్ కుమార్ "కేసరి చాప్టర్ 2" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో మాధవన్ , అనన్య పాండే కీలక పాత్రలలో నటించారు. కొంత కాలం క్రితం కేవలం హిందీ భాషలో విడుదల అయిన ఈ సినిమాకు అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది.

దానితో ఈ మూవీ మంచి కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా హిందీ లో విడుదల అయ్యి ప్రేక్షకులను ఎంత గానో అలరించి మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాను తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కేసరి చాప్టర్ 2 మూవీ ని మే 23 వ తేదీన తెలుగు భాషలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇప్పటికే హిందీ లో ఈ సినిమా మంచి విజయం సాధించి ఉండడంతో తెలుగు ప్రేక్షకులు ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మరి హిందీ ప్రేక్షకులను అలరించడంలో సూపర్ గా సక్సెస్ అయిన కేసరి చాప్టర్ 2 మూవీ తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే కేసరి చాప్టర్ 2 మూవీ పై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: