టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ కలిగిన స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించిన ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. చిరంజీవి కొంత కాలం క్రితం బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. శృతి హాసన్మూవీ లో హీరోయిన్గా నటించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ సినిమాకు కోనా వెంకట్ స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేశాడు.

తాజాగా కోన వెంకట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా చిరంజీవితో మూవీ గురించి సంబంధించి కోనా వెంకట్ కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా కోనా వెంకట్ మాట్లాడుతూ ... చిరంజీవి , బాబి కొల్లి కాంబో లో మరో మూవీ రాబోతోంది. ఇప్పటికే చిరంజీవి , బాబి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వీరిద్దరి కాంబోలో రాబోయే రెండో సినిమా వాల్తేరు వీరయ్య సినిమా కంటే మించిన స్థాయిలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. చిరంజీవి గారు కూడా కాస్త కొత్త దనం ఉన్న కథలో నటించడానికి ఉత్సాహ పడుతున్నారు.

భాషా సినిమా ఫార్మేట్ లో కట్ చేస్తే ఓ ఫ్లాష్ బ్యాక్ రావడం , అందులో హీరో గొప్ప వాడిలా ఉండే కథల్లో ఆయన నటించడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. అందుకే మేము కూడా సరికొత్త కథను చిరంజీవి గారి కోసం రెడీ చేస్తున్నాం. చిరంజీవి గారితో మేము చేయబోయే సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని కోనా వెంకట్ తాజాగా చెప్పుకొచ్చాడు. తాజాగా కోన వెంకట్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: