
ప్రభాస్ ఇందులో పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారని చెప్పి అభిమానుల అంచనాలను పెంచేశారు. అలాగే ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా ఫిక్సయిందనే విధంగా వార్తలు వినిపించాయి. కానీ తాజాగా స్పిరిట్ సినిమా నుంచి దీపికాను డైరెక్టర్ వంగ తప్పించారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రభాస్ తో కలిసి కల్కి సినిమాలో నటించడం వల్లే స్పిరిట్ సినిమాకి ఒప్పుకున్నదని వినిపించాయి... కానీ ఇప్పుడు ఏకంగా స్పిరిట్ సినిమా నుంచి దీపికాను తప్పించడానికి చాలానే కారణాలు ఉన్నాయని విధంగా కొన్ని వైరల్ గా మారుతున్నాయి.
ముఖ్యంగా దీపికా పదుకొనే చాలా కండిషన్స్ పెట్టింది అన్నట్లుగా వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా తాను ప్రతిరోజు 8 గంటలు మాత్రమే షూటింగులకు వస్తానని.. అందులో కూడా 6:00 మాత్రమే షూటింగ్లో పాల్గొంటుందట.. అందుకు ఆమెకు 20 కోట్ల రూపాయలు అడగడమే కాకుండా..అలాగే ప్రాపర్టీ లో కూడా వాటా అడిగినట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగు డబ్బింగ్ సంబంధించి సొంతంగా చెప్పమని అడిగితే నో అని చెప్పిందట. వాస్తవానికి స్పిరిట్ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉండగా.. దీపికా ప్రెగ్నెంట్ అయ్యి పాపకు జన్మనివ్వడంతో కొంతమేరకు ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, దీపికాకు అసలు పడట్లేదని వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయనే విధంగా బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. మరి ఏది నిజమో చూడాలి.