
అయితే ఇప్పుడు తాజాగా మార్క్ శంకర ఆరోగ్యానికి సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. అయితే ఈ వీడియోలో శంకర్ చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు. తన తల్లిదండ్రులతో కలసి బహిరంగంగా కనిపించారు. తన కుటుంబంతో కలిసి విమానాశ్రయంలో నడుచుకుంటూ కనిపించారు మార్క్ శంకర్. ఒక బ్యాగ్ మోసుకొని చాలా వేగంగా వెళుతున్నాడు మార్క్ శంకర్. దీన్నిబట్టి చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ కుమారుడు ఆరోగ్యం కూడా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నదని.. ఆరోగ్యంగానే ఉన్నాడన్నట్లుగా కనిపిస్తోంది.
అయితే ఈ విషయం అభిమానులకు కాస్త ఆనందాన్ని కలిగించే వార్తని చెప్పవచ్చు. పవన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేశారు.ఈ సినిమా ఈనెల 12న రిలీజ్ చేయబోతున్నారు. మరొక సినిమా ఓజి ఈ ఏడాది సెప్టెంబర్ లోని రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని కూడా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ని ఇచ్చింది. మొత్తానికి పవన్ మళ్లీ సినిమాల పరంగా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.