కొన్ని కొన్ని సందర్భాలలో ఒకే రోజు థియేటర్లలో అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అలా విడుదల అయిన సినిమాలలో ప్రేక్షకులు కొన్ని సినిమాలపైనే ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అలా ఆసక్తి చూపించే సినిమాలకే మొదటి రోజు మంచి కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇక వేరే ఏదైనా సినిమాకు మంచి టాక్ వచ్చినట్లయితే ఆ మూవీ కలెక్షన్లు నెక్స్ట్ డే నుంచి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే నిన్న అనగా మే 30 వ తేదీన 7 కొత్త సినిమాలు , ఒక పాత సినిమా థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్న అనగా మే 30 వ తేదీన భైరవం , షష్టిపూర్తి , 007 , ఘటికాచలం , పౌరుషం , కరాటే కిడ్ , అనే కొత్త సినిమాలతో పాటు చాలా కాలం క్రితం మహేష్ బాబు హీరోగా అనుష్క హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఖలేజా సినిమా కూడా రిలీజ్ అయింది. నిన్న విడుదల అయిన ఏడు కొత్త సినిమాల కంటే కూడా ప్రేక్షకులు చాలా కాలం క్రితం విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర అపజయాన్ని అందుకున్న ఖలేజా సినిమాను థియేటర్లలో చూడడానికి అత్యంత ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది.

నిన్నటి విషయానికి వస్తే నిన్న అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయినప్పటికీ ఖలేజా , భైరవం సినిమాలకు మాత్రమే మంచి కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మిగతా సినిమాలు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు అని సమాచారం. మరి రాబోయే రోజులలో నిన్న విడుదల అయిన ఏ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలుస్తోంది. ఏదేమైనా కూడా మహేష్ బాబు హీరోగా అనుష్క హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఖలేజా సినిమా రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకుంటుంది. దానితో రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా సరికొత్త రికార్డులను నెలకొల్పే అవకాశాలు ఉన్నట్లు అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mb