
బర్తడే కేక్ విషయంలో పబ్ నిర్వాహకులకు, కల్పికా గణేష్ మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.అయితే ఈ వివాదం పైన స్పందిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది నటి కల్పికా. పబ్ లో గొడవ కేవలం పబ్లిసిటీ కాదని తెలియజేసింది. బర్తడే పార్టీలో తాను మందు తాగలేదు తనకి మందు తాగే అలవాటు ఉండదని..ఈ విషయం తన తల్లిదండ్రులకు, స్నేహితులకు కూడా తెలుసు అంటూ తెలిపింది కల్పికా. గతంలో చాలా ఫంక్షన్లకు ఈవెంట్లకు తాను వైన్ తీసుకున్నాను అంటూ తెలిపింది.
ప్రస్తుతం అయితే ఆలవాటుకు కొంచెం దూరంగా ఉన్నానని పబ్ లో కేవలం వార్మ్ వాటర్ మాత్రమే తీసుకున్నాను అంటూ వెల్లడించింది. అంతేకాకుండా బిగ్ బాస్ 9 లో అవకాశం కోసం మీరు ఇలా చేశారా అంటూ ఈమెను అడగగా.. అలాంటిదేమీ లేదు తనని వాళ్లే హౌస్ లో చూడాలనుకుంటున్నారేమో అన్నట్లుగా సమాధానాన్ని తెలియజేసింది నటి కల్పికా. అంతేకాకుండా ఈ అమ్మడు క్యాస్టింగ్ కౌచ్ పైన కూడా గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా పెను దుమారాన్ని సృష్టించాయి.