పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక అద్భుతమైన ఈమేజ్ ను సొంతం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పార్టీని స్థాపించిన మొదటిలో పవన్ కళ్యాణ్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. కానీ ఆయన వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఎంతో కాలం పాటు రాజకీయాల్లో కొనసాగి తాజాగా జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఏ ఏం రత్నం నిర్మించాడు. ఈ మూవీ ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఏ ఏం రత్నం ప్రస్తుతం వరుస పెట్టి ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తున్నాడు.

అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ ... మేము పవన్ కళ్యాణ్ హీరోగా సత్యగ్రహి అనే సినిమాను ప్లాన్ చేశాం. ఆల్మోస్ట్ ఆ సినిమా స్టార్ట్ కానున్న సమయంలో కొన్ని కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం ఆ సినిమా గురించి మాట్లాడుతూ నేను కనుక సత్యాగ్రహి సినిమా చేసి ఉండుంటే రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదు అని చెప్పాడట. ఈ విషయాన్ని ఏఏం రత్నం తాజాగా చెప్పుకొచ్చాడు. దానితో అనేక మంది సత్యాగ్రహి చేసి ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకపోయి ఉండుంటే ఉపముఖ్యమంత్రి కూడా కాకపోయేవాడు అనే అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: