హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో షాహిద్ కపూర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరియర్లో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం తెలుగులో అద్భుతమైన విజయం సాధించిన అర్జున్ రెడ్డి మూవీ కి రీమేక్ గా రూపొందిన కబీర్ సింగ్ అనే సినిమాలో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తో ఈయన క్రేజ్ ఒక్క సారిగా భారీ ఎత్తున పెరిగింది. ఆ తర్వాత ఈయన తెలుగులో మంచి విజయం అందుకున్న జెర్సీ మూవీ ని కూడా హిందీ లో రీమిక్ చేశాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. కొంత కాలం క్రితం ఈయన దేవ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కూడా ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది. ఇకపోతే షాహిద్ కపూర్ ఇప్పటికే కాక్టెయిల్ 2 అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఏకంగా ఇద్దరు స్టార్ హీరోయిన్స్ షాహిద్ కపూర్ తో ఆడి పడనున్నట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... కాక్టెయిల్ 2 మూవీ లో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లు అయినటువంటి రష్మిక మందన , కృతి సనన్ హీరోయిన్లుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న మూవీ కావడం , ఆ మూవీ లో రష్మిక మందన , కృతి సనన్ హీరోయిన్లుగా కనిపించనుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి మంచి అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: