
నేను హీరోను దృష్టిలో ఉంచుకుని స్క్రిప్ట్ తయారు చేస్తానని సెకండాఫ్ లోడ్ బ్రహ్మానందంపై వేశానని శ్రీనువైట్ల వెల్లడించారు. బ్రహ్మానందం గారికి కూడా నాపై ఎంతో కాన్ఫిడెన్స్ ఉండేదని శ్రీనువైట్ల పేర్కొన్నారు. గోపీ మోహన్, కోన వెంకట్ తో కలిసి టీమ్ వర్క్ లా చేశామని ఆయన చెప్పుకొచ్చారు. షూటింగ్ స్పాట్ కు రైటర్స్ రావడం నా సినిమాలకు జరగలేదని శ్రీనువైట్ల తెలిపారు.
ఢీ సినిమా రీరిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కామెంట్లు చేశారు. ప్రతి సినిమాకు ఫైనల్ వెర్షన్ నేనే రాస్తానని దూకుడు సినిమాను చాలా స్పెషల్ గా తీసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. రైటర్స్ కు క్రెడిట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్లకు నాకు గ్యాప్ వచ్చినట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు. ఇప్పుడు రెగ్యులర్ గా మాట్లాడుకుంటామని ఆయన తెలిపారు.
ఆగడు సినిమా అంత మాస్ నాకు మహేష్ కు సెట్ కాలేదని చెప్పుకొచ్చారు. ఆగడు సినిమాలో లౌడ్ గా ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు. పెద్ద హీరోలతో సినిమా చేయలేకపోవడానికి కారణం సక్సెస్ అని శ్రీనువైట్ల వెల్లడించారు. విశ్వం సినిమా ఫలితం విషయంలో నేను హ్యాపీ అని ఆయన అన్నారు. నా నుంచి ఫుల్ లెంగ్త్ కామెడీ ప్రేక్షకులు కోరుకుంటున్నారని శ్రీనువైట్ల తెలిపారు. నా కెరీర్ విషయంలో సంతృప్తితో ఉన్నానని డైరెక్టర్ శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు.