బాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా పేరు సంపాదించిన దీపిక పదుకొనే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వరస సినిమాలతో బిజీగా ఉన్నది. తెలుగు సినీ ఇండస్ట్రీలో కల్కి సినిమాలో నటించి పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించింది. అయితే ఈ సినిమా సెట్ లోకి ప్రవేశించక ముందే ఫెమినిజం అనే ఎజెండాను కూడా  తెరలేపింది.మేల్ డామినేట్ ఇండస్ట్రీ పైన తాను తగ్గించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నానంటూ వెల్లడించింది. కానీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ముందు మాత్రం ఇలాంటి హవా కొనసాగించలేకపోయింది దీపిక.


స్పిరిట్ సినిమాలో దీపిక హీరోయిన్గా మొదట అనుకున్నప్పటికీ ఆమె కండిషన్స్ అన్ని విన్న తర్వాత సందీప్ రెడ్డి వంగ ఆమెను ఆ ప్రాజెక్టు నుంచి తప్పించేయడమే కాకుండా చిన్న హీరోయిన్ ని ఎంపిక చేయడం జరిగింది. అయితే దీపికని రిజెక్ట్ చేసిన కొన్ని సెకండ్లలోనే హీరోయిన్ ట్రీప్తి దిమ్రి నీ హీరోయిన్ గా ఎంపిక చేసి ఆమెకు పెద్ద షాక్ ఇచ్చారు.దీపిక పిఆర్పి టీమ్ కూడా స్పిరిట్ సినిమాని తక్కువ చేసి మాట్లాడడంతో పాటుగా డామేజ్ చేసే ప్రయత్నం కూడా చేసింది. ఈ విషయం పైన సందీప్ రెడ్డి వంగ సోషల్ మీడియా లెవల్లో ఫైర్ కావడంతో  అక్కడి నుంచి దీపికకు బ్యాక్ టైం మొదలైంది.


దీపిక యాటిట్యూడ్ కారణంగా స్పిరిట్ నుంచి తొలగించారనే వార్తలు బయటపడ్డాయి. బాలీవుడ్ లో కూడా చాలామంది హీరోయిన్స్ కి భయం పుట్టేలా చేశారు. ఫిమేల్ ఆర్టిస్టులకు చాలా బలమైన పాత్రలను ఇచ్చే సందీప్ రెడ్డి వంగ వంటి వారు ఇలా చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో దీపికకు అవకాశాలు ఇచ్చిన చాలా మంది నిర్మాతలు ఆమె సినిమాల పైన ఆలోచింపచేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాకు టైల్ 2 సినిమాలో అవకాశం కోల్పోయిందని ఈమె ప్లేస్ లో రష్మిక ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కల్కి 2 చిత్రంలో కూడా దీపిక కొనసాగుతుందా లేదా అనే విషయం క్లారిటీగా తెలియాలి. అయితే దీపికకు సినిమా రిజెక్ట్ వల్ల సుమారుగా 50 కోట్ల వరకు నష్టం వాటిలినట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: