కొన్ని సంవత్సరాల క్రితం సుధీర్ బాబు హీరో గా నందిత హీరోయిన్గా ప్రేమ కథ చిత్రమ్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రభాకర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2013 వ సంవత్సరం జూన్ 7 వ తేదీన పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయింది. కానీ ఈ సినిమాకు విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ఆ సమయంలో సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేకపోవడంతో ఈ మూవీ కి కేవలం 4.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది.

కానీ ఈ సినిమా భారీ లాభాలను అందుకొని బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. నిలిచింది. ఈ సినిమాకు మొత్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి ..? ఈ సినిమా ఎన్ని కోట్ల లాభాలతో అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం. టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 4 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.10 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.60 కోట్లు , వెస్ట్ లో 80 లక్షలు , గుంటూరులో 90 లక్షలు , కృష్ణ లో 75 లక్షలు , నెల్లూరు 45 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 10.60 కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కలుపుకొని ఈ మూవీ కి 1.05 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11.65 కోట్ల  కలెక్షన్లు దక్కాయి.  4.2 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తంగా 11.65 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ మూవీ కి ఏకంగా 7.45 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sb