స్టార్ హీరో బాలయ్య మంచి మనస్సు గురించి సినిమా ఇండస్ట్రీలో కథలుకథలుగా చెప్పుకుంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే ఆదుకునే విషయంలో బాలయ్యకు ఎవరూ సాటిరారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సొంత డబ్బులను ఖర్చు చేసి బాలయ్య హిందూపురం అభివృద్ధి కోసం ఊహించని స్థాయిలో కృషి చేసిన సంగతి తెలిసిందే. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కరం దిశగా బాలయ్య అడుగులు వేశారు.
 
తారకరత్న మరణం అనంతరం అలేఖ్య కుటుంబానికి బాలయ్య అండగా నిలిచిన సంగతి తెలిసిందే. సొంతవాళ్లైనా చాలామంది సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు. అయితే బాలయ్య మాత్రం అలేఖ్య ఫ్యామిలీకి ఆర్థికంగా ఎలాంటి కష్టం రాకుండా తన వంతు సహాయసహకారాలు అందించారు. కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో తారకరత్న మృతి చెందిన సంగతి తెలిసిందే.
 
అలేఖ్యరెడ్డి సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అలేఖ్యారెడ్డి తన పిల్లలను ఏ రంగంలో ప్రోత్సహిస్తారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. బాలయ్య ప్రస్తుతం అఖండ2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అఖండ2 సినిమా బాలయ్య కెరీర్ లో హిట్ గా నిలిచిన అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కడం గమనార్హం.
 
అఖండ సీక్వెల్ టీజర్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. అఖండ సీక్వెల్ లో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. విదేశాల్లో సైతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అఖండ2 టీజర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియాల్సి ఉంది. బాలయ్యలా కోటికొక్కరు ఉంటారని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.




 


మరింత సమాచారం తెలుసుకోండి: