
అలా సుమారుగా 750 పైగా చిత్రాలకు పైగా నటించిన ఈ నటుడు ఏకంగా తొమ్మిది నంది అవార్డులను కూడ గెలుచుకున్నారు. రాజకీయాలలో కూడా 1999 నుంచి 2004 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. అయితే గత రెండేళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూలలో కనిపిస్తూ ఉన్నారు. వృద్ధాప్య సమస్యల కారణంగా గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమైన కోట.. చివరిగా 2023లో సువర్ణ సుందరి అనే చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత బయట కూడా పెద్దగా కనిపించలేదు.
తాజాగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ,కోటా శ్రీనివాసను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.. అయితే ఈ ఫోటో చూసిన అభిమానులు ఆశ్చర్యపోతూ ఆందోళన చెందుతున్నారు.. కోట శ్రీనివాసరావు బక్క చిక్కిపోయి మరి గుర్తుపట్టలేనంతగా మారిపోవడమే కాకుండా పాదాలకి కట్టుతో కనిపించారు. ఆరోగ్యం పైన కూడా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కోట శ్రీనివాసరావు అనారోగ్య సమస్యలపై ఇప్పటివరకు ఏ విధమైనటువంటి క్లారిటీ రాలేదు.. మరి ఈ విషయం పైన ఆయన స్వయంగా స్పందిస్తారేమో చూడాలి మరి. ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి పేరు సంపాదించిన కోటా శ్రీనివాసరావు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని అభిమానులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఫోటోలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.