నిన్నటి రోజున ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టినరోజు సందర్భంగా ఆమె తన వేడుకలను చాలా గ్రాండ్గా చేసుకున్నట్లు తెలుస్తోంది.. అయితే ఈ వేడుకలలో గంజాయి, డ్రగ్స్ చిక్కినట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మంగ్లీ కూడా పోలీసుల పైన ఫైర్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు సింగర్ మంగ్లీ తో ఫోటో వాడుతూ అసాంఘిక కార్యక్రమాలు ఎవరైనా చేపడితే ఊరుకునేది లేదంటూ కూడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.


అయితే ఎట్టకేలకు తన బర్తడే పార్టీలో జరిగిన విషయంపై సింగర్ మంగ్లీ స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేసింది.. అందరికీ నమస్కారం నిన్నటి రోజున తన బర్తడే పార్టీ జరిగిందో అది ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చేసుకున్నామని.. అందుకే తన కుటుంబం కోరిక మేరకే ఒక రిసార్ట్ లో తల్లిదండ్రులతో కలిసి తను ఈ పార్టీ జరుపుకోవడం జరిగిందని తెలిపింది. అక్కడికి తన కుటుంబంతో పాటు స్నేహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారని తెలిపింది సింగర్ మంగ్లీ.


అయితే ఈ పార్టీలో లిక్కర్ ఉంది, సౌండ్ సిస్టం కూడా ఉంది.. కానీ ఇలా పార్టీలో సౌండ్ సిస్టం కి లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని తనకి ఆలోచన రాలేదని ఎందుకంటే సడన్గా ప్లాన్ చేసుకున్నాము.. పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఉంటే తాను ముందుగా పర్మిషన్ తీసుకొని ఉండేదాన్ని.. తమ పార్టీలో ఎలాంటి తప్పు జరగలేదని పార్టీ గురించి పోలీసులకు పర్మిషన్ తీసుకోవాలని తనకు కూడా ఎవరూ చెప్పలేదని ఒకవేళ ఎవరైనా చెప్పి ఉంటే తాను పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి పర్మిషన్ తీసుకునే దాన్ని అంటూ తెలిపింది.. ఇక వీడియోలను చూపించినట్లుగా పార్టీలో ఎక్కడా కూడా విదేశీ మద్యం దొరకలేదని.. తన పార్టీలో ఎవరు కూడా గంజాయి కానీ డ్రగ్స్ కానీ తీసుకోలేదని.. అయితే తన పార్టీకి వచ్చిన ఒక వ్యక్తి ఎక్కడో గంజాయి తీసుకొని పార్టీకి వచ్చారని.. తన కుటుంబంతో స్నేహితులతో కలిసి ఈ పార్టీ చేసుకుంటున్నాను తల్లితండ్రుల ముందు తాను ఎలా తప్పు చేస్తానంటూ ఈ వీడియోలో వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: