
ఇప్పటివరకు రాజమౌళి తన సినిమాల విషయంలో డైలాగ్స్ ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రాజమౌళి సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేసేస్తున్నారు ఆకతాయిలు . మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అలాంటి డైలాగ్స్ పెట్టడం నిజంగా రాజమౌళి డేరింగ్ కి హ్యాట్సాఫ్ అంటూ అప్పట్లో తెగ పొగిడేసారు. జూనియర్ ఎన్టీఆర్ - రాజమౌళి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ . వీళ్ల కాంబోలో సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనేలేదు . మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి అభిమానులకి అదో తెలియని స్పెషల్ క్రేజీ కిక్ ఫీలింగ్.
వీళ్ళ కాంబోలో వచ్చిన యమదొంగ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్ వేరే లెవెల్ . ఎన్టీఆర్ పర్ఫామెన్స్ కి ఇక మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ . అలా ఉండింది పర్ ఫామెన్స్. ఈ సినిమాల్లో మమతా మోహన్ దాస్ - ప్రియమణి హీరోయిన్లుగా నటించారు . మమతా మోహన్ దాస్ - ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సీన్స్ భలే కామెడీగా ఉంటాయి . మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ - ఆలీ - మమతా మోహన్ దాస్ ని చీట్ చేసే సీన్స్ వెరీ వెరీ ఫన్నీ .
మమతా మోహన్ దాస్ ని చీట్ చేసే క్రమంలో ఆలీ ఒక బొమ్మగా మారి పండించిన కామెడీ అంతా ఇంతా కాదు . అయితే ఆ తర్వాత మమతా మోహన్ దాస్ ఎలా ఆలీ ఎన్టీఆర్ లు చేసిన పనికి కోప్పడుతుందో తెరపై అందరూ చూసి నవ్వుకున్నారు. అయితే మమతా మోహన్ దాస్ లాంటి ఒక సాఫ్ట్ హీరోయిన్ చేత ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోని తిట్టించే డైలాగ్ లు అప్పట్లో జనాలు హాట్ టాపిక్ గా మాట్లాడుకున్నారు. మమతా మోహన్ దాస్ - ఎన్టీఆర్ - ఆలీ తనను మోసం చేశారు అన్న కోపంతో ఓ డైలాగ్ చెబుతుంది .
"నా కొడకల్లారా నన్నే మోసం చేస్తారా..? ఈసారీ కనపడాలి నెల్లూరు ట్రంకు రొడ్డులో బట్టలు ఊడదీసి కడతా నాయాల్లారా" అంటూ తనదైన స్టైల్ లో స్లాంగ్ అదరగొట్టేస్తుంది . ఆ సీన్ వచ్చినప్పుడు థియేటర్స్ లో అరుపులు కేకలు రచ్చ రంబోలానే. అయితే ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ హీరో పై అలాంటి డైలాగ్ ఎలా రాశాడు రాజమౌళి అంటూ అప్పట్లో జనాలు కొంతమంది నెగటివ్గా మాట్లాడుకున్నారు . అయితే అదంతా సినిమాలో బాగమంటూ ఆ తర్వాత మర్చిపోయారు. మరొకసారి ఇదే డైలాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ హైలెట్ చేస్తున్నారు అభిమానులు . యమదొంగ సినిమా నందమూరి అభిమానులకి వన్ ఆఫ్ ద ఎన్టీఆర్ నటించిన సినిమాలలో ఫేవరెట్ మూవీ అని చెప్పుకోక తప్పదు. ఈ సినిమాలో రబ్బరు గాజులు సాంగ్ లో ఎన్టీఆర్ - ప్రియమణి వేసిన డాన్స్ ఇప్పటికీ అభిమానులు లైక్ చేస్తూనే ఉన్నారు..!!