అనుష్క ప్రభాస్ పెళ్లి వార్తలు ఎప్పుడూ నెట్టింట్లో హాట్ టాపిక్ గానే ఉంటాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఈ ఇద్దరి నటీనటుల అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.. అయితే ఇంత ఏజ్ వచ్చినా కూడా ఈ ఇద్దరు పెళ్లికి సంబంధించి ఒక్కసారి కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక ఆ మధ్యకాలంలో అనుష్క పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పటికీ అది జరగలేదు.అయితే ఇంత ఏజ్ వచ్చినా వీరు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమే అంటారు ఇండస్ట్రీ జనాలు. అనుష్క ప్రభాస్ మధ్య ప్రేమ ఉందని, కానీ ప్రభాస్ సినిమాల కోసమే అనుష్క ఇంకా పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తుందని, ఏ కొంచెం గ్యాప్ దొరికినా చాలు ప్రభాస్ అనుష్క ఒక్కటైపోవడం ఖాయం అంటూ ఎంతోమంది ఈ ఊహగానాలను వైరల్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభాస్ మాట్లాడిన ఒక వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.అనుష్కకు నాకు పెళ్లి జరిగితేనే మీరందరూ సైలెంట్ అవుతారు.ఈ వార్తలన్నీ ఆగిపోతాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభాస్.మరి ప్రభాస్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు.. నిజంగా అనుష్క మీద ప్రేమతోనే అలా మాట్లాడారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో అనుష్కకు నాకు పెళ్లి జరిగితేనే ఈ వార్తలన్నీ ఆగిపోతాయి అని అన్నది నిజమే.కానీ ఆయన ఏ విధంగా  అన్నారంటే..ప్రభాస్ అనుష్క పెళ్లి అంటూ చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతిసారి ఈ వార్తలు విని వినీ బోర్ కొడుతుంది. అయితే మా ఇద్దరిలో ఎవరో ఒకరికి అంటే నాకు పెళ్లి జరిగినా లేక అనుష్కకు పెళ్లి జరిగినా ఈ వార్తలు అక్కడితో ఆగిపోతాయి. మేము ఇద్దరం పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండడం వల్లే మా ఇద్దరి పెళ్లి అంటూ వార్తలు రాసేస్తున్నారు.

మా ఇద్దరిలో ఎవరో ఒకరి పెళ్లి జరిగితే మీరు అంతా సైలెంట్ అవుతారు. అందుకే నాకైనా లేక అనుష్క కైనా పెళ్లి జరగాలి అంటూ ప్రభాస్ స్పందించారు. అయితే ప్రభాస్ ఈ మాటలు మాట్లాడడానికి కారణం ప్రభాస్ కి అనుష్కకి పెళ్లి జరిగినట్టు ఏఐ ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా వీరికి ఇద్దరు పిల్లలు పుట్టినట్టు కూడా కొన్ని ఫొటోస్ క్రియేట్ చేస్తున్నారు. అందుకే ప్రభాస్ అలా మాట్లాడి ఉంటారు. మరి చూడాలి వీరిద్దరూ పెళ్లి చేసుకుని జంట అవుతారా..లేక వేరే లైఫ్ పార్ట్నర్లని వెతుక్కుంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.ఇక ప్రభాస్ అయితే ప్రస్తుతం వరుస లైనప్ లతో చాలా బిజీగా ఉన్నారు. ఇక అనుష్క రీసెంట్గా నటించిన ఘాటీ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: