ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం తీసుకొచ్చిన వాహనమిత్ర పథకం దసరా కానుకగా అమలు కానుంది. ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారుడికి రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. అయితే, ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందాలంటే, వాహనానికి యజమాని అయిన వ్యక్తి మాత్రమే దానిని నడపాలి. అంటే, యజమాని-కమ్-డ్రైవర్ అయిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

కుటుంబంలో ఎవరికైనా తెల్ల రేషన్ కార్డు ఉంటే, ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తి మాత్రమే ఈ పథకానికి అర్హులు. గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదు. లబ్ధిదారుల కుటుంబం నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటకూడదు. పట్టణాలు లేదా మున్సిపాలిటీలలో నివసించే వారి స్థిరాస్తి 1,000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి. వాహనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉండాలి, అలాగే దానికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి.

వాహనం నడిపే వ్యక్తికి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఈ నియమాలను పాటించిన వారికి దసరా పండుగ నాటికి ప్రభుత్వం అందించే రూ.15,000 ఆర్థిక సహాయం అందుతుంది. గతంలో  వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ పథకం అమలులో భాగంగా  నెలకు 10,000   రూపాయలు ఇచ్చేది.  కూటమి సర్కార్ ఆ మొత్తాన్ని భారీగా పెంచడం  హాట్ టాపిక్ అవుతోంది.

అయితే ఈ నియమనిబంధనలు మరీ కఠినంగా ఉన్నాయనే  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎంతమంది ఆటోడ్రైవర్లు ఈ స్కీమ్  బెనిఫిట్స్ పొందుతారో చూడాల్సి ఉంది. ఏపీ  ప్రభుత్వం గతంలో అమలైన అన్ని పథకాల అమలు దిశగా అడుగులు వేస్తోంది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: