
షర్మిల పబ్లిసిటీ కోసమే వైసీపీపై తరచూ విమర్శలు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం షర్మిల విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటూ వైసీపీని టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కర్నూలుకు వెళ్లి ఉల్లి రైతులకు అన్యాయం జరుగుతోందని ఆమె చెప్పడంతో పాటు ఉపరాష్ట్రపతి ఎన్నికల గురించి షర్మిల చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అయ్యాయి.
ఈ మధ్య కాలంలో షర్మిల చేస్తున్న కామెంట్లకు ఎల్లో మీడియాలో సైతం ప్రాధాన్యత దక్కుతోంది. షర్మిల ఎవరిని విమర్శించినా అందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. జగన్ గురించి షర్మిల ఎలాంటి విమర్శలు చేసినా తక్కువ సమయంలోనే అందుకు సంబంధించిన కథనాలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమె చేసినా కామెంట్లకు పబ్లిసిటీ బాగానే దక్కింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అసలు వారసుడు వైఎస్ రాజారెడ్డి అంటూ షర్మిల చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా సంచలనం అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే షర్మిల కొనసాగుతున్నారు. షర్మిల తర్వాత కాంగ్రెస్ లో ఆ బాధ్యతలు ఎవరికీ దక్కుతాయనే ప్రశ్నకు సమాధానం దొరకడం అంత తేలికైన విషయం అయితే కాదని చెప్పవచ్చు.
కాంగ్రెస్ రాజారెడ్డికి బాధ్యతలను అప్పగించాలని అనుకుంటే అలానే చేస్తుంది. వైసీపీకి షర్మిలకు ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ రాజారెడ్డి ప్రూవ్ చేసుకుని రాజకీయాల్లో సక్సెస్ సాధిస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు