టాలీవుడ్‌లో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "మిరాయి". ఈ చిత్రంలో యువ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించగా, ప్రతిభావంతుడైన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను ఎంతో శ్రద్ధగా తెరకెక్కించారు. కథలో కొత్తదనం, సన్నివేశాల్లో ఉన్న నైపుణ్యం, విజువల్స్‌లోని వైవిధ్యం చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ప్రత్యేకంగా అనిపించింది. సినిమా చూసిన ప్రేక్షకులు, విమర్శకులు అందరూ ఈ చిత్ర బృందం పడిన కష్టం సిల్వర్‌స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం, తేజ సజ్జ నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఆయన పాత్రలోని ఇన్నోసెన్స్, యాక్షన్ సన్నివేశాల్లోని ఇంపాక్ట్, భావోద్వేగ సన్నివేశాల్లో చూపిన మేచ్యూరిటీ సినిమా రేంజ్‌ని పెంచాయి. తేజ ఈ సినిమాకోసం చేసిన కష్టాన్ని అందరూ గుర్తించి ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై మంచి పాజిటివ్ రివ్యూలు వినిపిస్తున్నాయి.


అయితే, ఇంత బాగున్న సినిమాపై కొంతమంది కావాలనే కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. తేజ అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతూ, "సినిమా ఇంత బాగుంటే ఇలా నెగిటివ్ రివ్యూలు ఎందుకు రాస్తున్నారు? సినిమా తేజ సజ్జ స్థాయికి మించి ఉందని మేము భావిస్తున్నాం. తేజ ఒక్కో అడుగు ముందుకేసుకుంటూ ఎదుగుతున్న హీరో. అతను ఒకేసారి స్టార్ అయ్యిపోలేదని సినిమా విలువ తగ్గించాలా?" అంటూ ప్రశ్నిస్తున్నారు. తేజ సజ్జ కెరీర్‌‌లో ఇప్పటివరకు చూసిన ప్రతి సినిమా ప్రత్యేకతతో నిలిచింది. చిన్నతనం నుంచే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో తన ప్రయాణం ప్రారంభించిన తేజ, ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌బేస్ సంపాదించుకున్నాడు. అందుకే ఆయన ఎంచుకునే కథలు, పాత్రలు కొత్తదనం కలిగినవే. అభిమానులు మాట్లాడుతూ, "తేజ లాంటి ప్రతిభావంతుడైన హీరోపై ఇలా కావాలనే నెగిటివ్ రివ్యూలు రాయడం దారుణం. భవిష్యత్తులో తేజ తప్పకుండా పాన్-ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అవుతాడు. అందుకే ఇంత కష్టపడి మంచి సినిమాలు చేస్తున్నాడు. ఆయన కెరీర్‌పై ఇలా దెబ్బకొట్టే ప్రయత్నాలు చేయవద్దు" అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



ఇక నెగిటివ్ రివ్యూలు రాసే కొంతమంది మాత్రం వేరే కోణంలో వాదిస్తున్నారు. "సినిమా కథ, కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ అది అందరికీ రీచ్ కాలేకపోయింది. ఒకవేళ ఈ కథను ఒక పెద్ద స్టార్ నటించి ఉంటే సినిమా రేంజ్ ఇంకా పెరిగేది" అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అభిప్రాయాలను తేజ అభిమానులు అస్సలు అంగీకరించడం లేదు.  "పెద్ద స్టార్ అవసరం లేకుండా ఒక మంచి సినిమా చూస్ చేసుకున్నాడు తేజ . ఈ కథకు ప్రాణం పోశాడు. సినిమా విజయానికి ఆయన నటన ప్రధాన కారణం" అని" ప్రశంసిస్తున్నారు. మొత్తానికి, "మిరాయి" సినిమా పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతున్నా, కొన్ని నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: