వర్షా బొల్లమ్మ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కొద్ది సంవత్సరాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ల మాదిరిగానే గుర్తింపు సంపాదించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసింది తక్కువే సినిమాలే అయినప్పటికీ అందరికీ గుర్తిండి పోయే పాత్రల్లో నటించింది. అలా ఊరు పేరు భైరవకోన, మిడిల్ క్లాస్ మెలోడీస్, స్వాతిముత్యం, తమ్ముడు వంటి సినిమాల్లో చేసింది. ఇక తెలుగు కంటే ఎక్కువ తమిళ, మలయాళ సినిమాల్లోనే వర్షా బొల్లమ్మ రాణించింది. అచ్చం నజ్రియా నజీమ్ పోలికలతో ఉన్న వర్షా బొల్లమ్మకి ఎంతోమంది యూత్ అభిమానులుగా ఉన్నారు.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ గురించి గత కొద్ది రోజులుగా ఒక రూమర్ టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. 

అదేంటంటే వర్షా బొల్లమ్మ ఓ టాలీవుడ్ నిర్మాత ఇంటికి కోడలుగా వెళ్లబోతుంది అంటూ ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయం ఏమిటంటే..నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు రెండో కొడుకు బెల్లంకొండ గణేష్ నటించిన మొదటి మూవీ స్వాతిముత్యం. ఈ సినిమాలో వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమా వచ్చినప్పటినుండి వర్షా బొల్లమ్మ బెల్లంకొండ గణేష్ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే ఊహగాణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఇప్పటివరకు వర్షా బొల్లమ్మ తన ప్రేమని అఫీషియల్ గా ఎక్కడా కూడా బయట పెట్టకపోయినప్పటికీ వీరిద్దరి మధ్య లవ్ ఉందనే రూమర్స్ మాత్రం సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలోనే తాజాగా వర్షా బొల్లమ్మ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది. ఆ ఫోటోల కింద ఈ విధంగా క్యాప్షన్ ఇచ్చింది.. ఫ్యామిలీ అందరూ ఉన్నప్పుడు క్రష్ పంపించిన టెక్స్ట్ చదువుతున్నప్పుడు అంటూ కాప్షన్ ఇచ్చి ఫోన్ పట్టుకొని చూస్తూ కెమెరాకి రకరకాల ఫోజులు ఇచ్చింది. అయితే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో క్రష్ పంపించిన టెక్స్ట్ అంటే బెల్లంకొండ హీరోనేనా..పెళ్లెప్పుడు.. ఫైనల్ గా నీకు లవర్ ఉన్నాడని ఒప్పుకున్నావుగా అంటూ నెటిజన్లు వర్షా బొల్లమ్మ పెట్టిన పోస్ట్ కింద వైరల్ కామెంట్లు పెడుతున్నారు.. ఇక వర్షా బొలమ్మ రీసెంట్ గా కానిస్టేబుల్ కనకం అనే వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: