వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన పనులను ప్రచారం చేసుకోలేకపోయారు.. 2024లో ఘోరంగా ఓడిపోవడంతో తాము చేసుకున్న పనులను చెప్పుకోలేక ఓడిపోయామని ఇప్పటికీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు గా వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రచార విషయంలో మాత్రం సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య చాలా తేడా కనిపిస్తోంది. మంగళగిరిలో ఒక సంస్థ నిర్వహించినటువంటి సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి అక్కడ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలను తెలిపారు.


అయితే వైసిపి పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి బుగ్గన వెళ్లి అక్కడ కొన్ని విషయాలను తెలియజేసి, రాజధాని లాంటి కీలకమైన అంశాల పైన కూడా మాట్లాడారు. ఇక్కడ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎంత బిజీగా ఉన్నప్పటికీ  ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించారు. 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ  పార్టీ అధినేత వైయస్ జగన్ మాత్రం ఇలాంటి  కార్యక్రమానికి రాకుండా తన తరఫు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి బుగ్గన పంపించారు. ప్రతిపక్షనేతగా ప్రశ్నిస్తే బాగుంటుందని కానీ అలా చేయకుండా తన ఆస్థాన నాయకులను పంపించడంతో విమర్శలు వినిపిస్తున్నాయి.జగన్ ఇంటికి అతి సమీపంలో నిర్వహించినటువంటి ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు.


కానీ సీఎం చంద్రబాబు మాత్రం తాను వెళ్లి రాజధాని అమరావతి విషయంలో మాట్లాడడమే కాకుండా 2024 తర్వాత తమ ప్రభుత్వం ఏం చేసింది ఫ్యూచర్లో ఏం చేయబోతుందని తెలియజేస్తూ 2047 దాకా తన విజనరీ గురించి ఆవిష్కరించుకున్నారు. ఇలాంటి వేదికల పైన అధికారం పార్టీ తప్పులను వేలెత్తి చూపించాల్సిన అవసరం ఉంటుంది. రైతులకు సంబంధించి ,ఉద్యోగాలు, నిరుద్యోగులకు సంబంధించి ప్రతి నాయకుడిగా ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మైలేజ్ వస్తుందని, ఇలాంటి విషయాల వల్ల అధికార పార్టీకి ఊపిరాడకుండా చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..జగన్ మాత్రం అలా చేయలేకపోతున్నారు.. సీఎం చంద్రబాబు మాత్రం సమయాన్ని కేటాయించుకుని తాము చేస్తున్న పనులను ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఇంకా అజ్ఞానంలో నుంచి బయటికి రాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: