నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య అఖండ 2 సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో లీకై వైరల్‌గా మారింది. నందమూరి బాలయ్యసినిమా చేసినా అది అభిమానులను ఎంటర్టైన్ అయ్యే విధంగానే ఉంటుంది. మాస్, క్లాస్ ఏదైనా అభిమానులు ఎంజాయ్ అయితే చాలు అనుకునే టైప్ బాలయ్య. నటసింహం బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం అఖండ 2 తాండవం. ఈ సినిమాపై ప్రజలు ఏ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీజీ, వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక సెన్సేషనల్ విషయం లీకై వైరల్‌గా మారింది. ఈ సినిమా ఇంటర్వెల్ సీన్‌కి ముందు ఒక బిగ్ పాన్-ఇండియా స్టార్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడని హాట్ టాక్ నడుస్తోంది. బాలయ్య అంటే మొదటి నుంచి ఆ హీరోకి అభిమానం. ఆ కారణంగానే బోయపాటి శ్రీను అడగగానే ఈ రోల్‌ను ఓకే చేశారట. ఈ పాత్రను సర్ప్రైజ్‌గా ప్లాన్ చేశారట బోయపాటి శ్రీను. అంతేకాదు అదే హీరో క్లైమాక్స్‌లో వచ్చే సీన్‌లో కూడా ఎంటర్టైన్ చేయబోతున్నాడట. ఈ పాత్ర చుట్టూ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా నడుస్తాయని టాక్ వినిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.



బాలయ్య సినిమాలో నటించబోయే ఆ పాన్-ఇండియా స్టార్ ఎవరు? బోయపాటికి దగ్గర అంటున్నారు, బాలయ్యకు వీరాభిమాని అంటున్నారు… ఆ హీరో ఇతడేనా అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా ఒక బిగ్ హీరో పేరు వైరల్ చేస్తున్నారు అభిమానులు. బాలయ్యను, ఆ పాన్-ఇండియా హీరోను ఒకే స్క్రీన్‌పై పక్కపక్కన చూస్తే మాత్రం థియేటర్లలో బ్లాస్ట్ అయిపోవాల్సిందే అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో! ప్రసెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: