కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన మా నగరం అనే మూవీ తో దర్శకుడిగా సూపర్ సాలిడ్ గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే చాలా మంది దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేసే సందర్భంలో ఒక్కో మూవీ ని కంప్లీట్ చేయడానికి అత్యంత ఎక్కువగా సమయాన్ని తీసుకుంటూ ఉంటారు.

కానీ లోకేష్ కనకరాజు తన కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత అత్యంత వేగంగా చాలా సినిమాలకు దర్శకత్వం వహించి భారీ విజయాలను అందుకున్నాడు. ఇకపోతే లోకేష్ ఆఖరుగా తలపతి విజయ్ హీరోగా లియో అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా షూటింగ్ను కూడా చాలా త్వరగా పూర్తి చేసి ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. కానీ ఈ మూవీ లోకేష్ కనకరాజు గత సినిమాలతో పోలిస్తే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చాలా వరకు విఫలం అయింది. లియో మూవీ తర్వాత లోకేష్ , రజనీ కాంత్ హీరో గా కూలీ అనే సినిమాను మొదలు పెట్టాడు. దానితో చాలా మంది లోకేష్ తన ఓల్డ్ స్టైల్ లోనే కూలీ మూవీ షూటింగ్ను కూడా అత్యంత వేగంగా పూర్తి చేసి ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ కూలీ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితం స్టార్ట్ అయింది. 

మూవీ షూటింగ్ను లోకేష్ అత్యంత జాగ్రత్తగా మరియు స్లో గా రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇలా లోకేష్ కూలీ మూవీ షూటింగ్ను చాలా స్లో గా పూర్తి చేస్తూ రావడంతో లియో సినిమా భారీ విజయాన్ని అందుకోలేదు. అందుకే లోకేష్ ఈ సారి కాస్త స్లో గా కూలీ మూవీ ని రూపొందిస్తున్నాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా కూలీ సినిమాపై మాత్రం ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Lk