లవ్ స్టోరీ’ సక్సస్ తరువాత శేఖర్ కమ్ములకు మరొక సినిమా తీయడానికి మూడు సంవత్సరాలకు పైగా టైమ్ గ్యాప్ తీసుకున్నాడు. ధనుష్ నాగార్జున రష్మిక ల కాంబినేషన్ మూవీతో నిర్మించిన మూవీ ‘కుబేర’ కావడంతో అంచనాలు  భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈమూవీకి విమర్శకుల ప్రశంసలతో పాటు సగటు ప్రేక్షకుడి నుండి పాజిటివ్ టాక్ రావడంతో ఈసినిమా కలక్షన్స్ కు ఆకాశమే ఆకాశమే హద్దుగా మారుతుంది అన్న సంకేతాలు వస్తున్నాయి.


బంగాళా ఖాతంలో ఆయిల్ నిక్షేపాలు ఏర్పడటం డానికిపై ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కన్ను పడటం అధికార పార్టీని అడ్డు పెట్టుకుని లక్షల కోట్ల రూపాయల లంచం ఇచ్చి ప్రపంచ కుబేరుడు గా ఎదగడానికి ఒక బడా పారిశ్రామిక వేత్త వ్యవస్థను అడ్డు పెట్టుకుని చేసే ప్రయత్నాల చుట్టూ శేఖర్ కమ్ముల స్వయంగా వ్రాసుకున్న కథ ఊహా జనితంగా అనిపించినప్పటికీ నేటి వ్యవస్థలో ఉన్న లోపాలను చూపించే విధంగా దర్శకుడు చేసిన ప్రయత్నాలకు సగటు ప్రేక్షకి నుండి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.


అయితే ఈసినిమా నిడివి మూడు గంటలు పైగా ఉండటంతో ఇదే కథను కొంచం నిడివి తక్కువగా తీసి ఉంటే బాగుండేది కదా అన్న  ఫీలింగ్ సగటు ప్రేక్షకులలో ఏర్పడుతుంది. సినిమా కథ ఇంటలి జంట్ గా మొదలై ఆతరువాత సెంటిమెంటల్ గా మారి చివరికి యాక్షన్ ఫక్కీతో ఛేజింగ్ లతో ఈసినిమాను నడిపించిన శేఖర్ కమ్ముల ఈసినిమా ను సూపర్ హిట్ చేయాలి అన్న తాపత్రయం ప్రతి సీన్ లోనూ కనిపిస్తుంది.


బిచ్చగత్తె కు పుట్టిన పిల్లవాది చేతులతో విలన్ కు బిచ్చం వేయించే సీన్ పొయిట్ గా కనిపిస్తూ శేఖర్ కమ్ముల లోని వేదాంత ధోరణిని ప్రతిబింబ చేస్తుంది. ఈసినిమాలో ధనుష్ తో సమానమైన పాత్ర నాగార్జునకు ఉన్నప్పటికీ అమాయికత్వం మంచితనం కలబోసిన పాత్రలో ధను నాగార్జున ను డామినేట్ చేశాడు. ఒక కొత్త పాయింట్ తో సినిన శేఖర్ కమ్మల ప్రతిభను అందరు అందరు గుర్తించి తీరుతారు..


మరింత సమాచారం తెలుసుకోండి: