నితిన్ నటించిన తమ్ముడు సినిమా నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గేమ్ ఛేంజర్ సినిమా వ్యవహారం పైన, ఆ సినిమాకు వచ్చిన ఫలితం పైన మాట్లాడడం జరిగింది. rrr తర్వాత గ్లోబల్ స్థాయిలో రామ్ చరణ్ పేరు వినిపించిన తరువాత  గేమ్ ఛేంజర్ సినిమా విడుదలవ్వడం జరిగింది. కానీ ఆ సినిమా ఫలితంలో తాను చాలా రిగ్రేట్ గా ఫీల్ అయ్యానని వెల్లడించారు దిల్ రాజు. తాను ఈ సినిమా విషయంలో ఏమి చేయలేకపోయానని తన చేతుల్లో కూడా ఏమీ లేకుండా పోయిందని వెల్లడించారు. డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా కావడం చేత తాను ఇందులో ఇన్వాల్వ్మెంట్ కాలేకపోయానని వెల్లడించారు.


సాధారణంగా దిల్ రాజు బ్యానర్ లో సినిమా అంటే ఖచ్చితంగా అన్ని ఆయనే చూసుకుంటూ ఉంటారని అనుకుంటారు.అందుకే ఆయనకు సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుందని భావించారు.. గేమ్ ఛేంజర్ సినిమాలో మాత్రం తన ప్రమేయం ఏమీ లేదంటూ వెల్లడించారు. కేవలం అన్ని అలా జరిగిపోయాయని తెలిపారు దిల్ రాజు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా రామ్ చరణ్ కోఆపరేషన్ చాలా బాగా నచ్చిందని తెలియజేయడం జరిగింది. గేమ్ ఛేంజర్ సినిమాలో కేవలం పాటల కోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతోనే ఫ్లాప్ గా మిగిలిపోయింది.


దిల్ రాజు కేరియాలోనే భారీ ఫ్లాప్ సినిమాగా ఈ సినిమా నిలిచిపోయింది. ఇకమీదట ఇలాంటి తప్పులు జరగకుండా కంటెంట్ ఉండే చిత్రాలను మాత్రమే తీస్తానంటూ వెల్లడించారు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తమ్ముడు సినిమా జులై 4వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రంపై దిల్ రాజు కూడా చాలా కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నారు. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం జనాలలోకి వెళ్లాలని ముందుగా తానే ప్రమోషన్స్లో పాల్గొన్నట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: