
ఇదిలా ఉండగా ఈ సినిమాలో మంచు విష్ణు తన పిల్లలు ముగ్గురిని నటింప చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అరియానా, వివియానా, అవ్రామ్ ముగ్గురు కూడా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు
. ఈ సినిమా లో వీరిని అనవసరంగా పెట్టారు అని కొంతమంది కామెంట్లు చేస్తున్నార. నిజానికి వీరందరినీ కావాలనే ఈ సినిమాలో పెట్టారని, వీరి పాత్రలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా సమాచారం. ముఖ్యంగా మంచు విష్ణు తన సినిమా ద్వారా తన పిల్లల్ని పరిచయం చేయాలని చూశాడు. కానీ ఆ పాత్రలు ఆ పిల్లల కెరియర్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అనే విషయాన్ని విష్ణు గమనించలేకపోయాడా అంటూ కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు.
అంతేకాదు మంచు విష్ణు చేసిన పనికి ఇప్పుడు పిల్లలు ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోందంటూ కూడా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇక కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. ఎట్టకేలకు ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ సినిమా ఈ సినిమాపై మంచు మనోజ్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీనికి తోడు సినిమాకు సంబంధించి పలు విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ సినిమా ద్వారా పిల్లలు కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. మరి ఈ సినిమా వీరికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి