టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా పేరుపొందిన అల్లు అరవింద్ ఎప్పుడు కూడా ఎలాంటి విషయాలలోనైనా సరే యాక్టివ్ గా ఉంటారు. తాజాగా 50 ఏళ్ల క్రితం విడుదలైన ముత్యాలముగ్గు అనే చిత్రానికి సంబంధించి ఆత్మీయ కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఇందుకు సంబంధించి అల్లు అరవింద్ గెస్ట్ గా రావడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ బాపు దర్శకత్వం వహించగా ఇందులో కాంతారావు ,అల్లు రామలింగయ్య, సంగీత, రావు గోపాల్ రావు కీలకమైన పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా ఎవరీ గ్రీన్ సినిమాగా నిలిచింది.



సినిమా 50 ఏళ్లు విడుదలైన సందర్భంగా ఆత్మీయ సదస్సులో అల్లు అరవింద్, రాఘవేంద్రరావు వంటి వారు పాల్గొన్నారు..ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ చిత్రం గురించి కొన్ని విషయాలను తెలియజేశారు.. అల్లు అరవింద్ మాట్లాడుతూ తనకు బాపు, రమణ గారిని చూస్తే చాలా భయం వేసేదని ఎందుకంటే మా నాన్నగారు వారి గురించి ఇచ్చే ఎలివేషన్ అలాంటిది అంటు తెలియజేశారు. అది నా మైండ్ లో ఇప్పటికీ అలాగే ఉండిపోయింది అంటు తెలిపారు అల్లు అరవింద్.

మా నాన్న దగ్గర డబ్బులు ఉంటే వాటిని తీసుకువెళ్లి ఎప్పుడు రమణ గారికి ఇచ్చేవారు ఎందుకంటే ఆయన మీద తనకి ఉన్న నమ్మకం అలాంటిది. అందుకే ఆయన్ను ఒక బ్యాంకు లాగా చూసేవారని తెలిపారు అల్లు అరవింద్.. బాపుగారు అంటే తన తండ్రికి ఒక గురువు లాగా భావించేవారు.. ఈ చిత్రంలో కోతి లాగా చేయాలని బాబు గారు మా నాన్నగారిని అడిగితే.. నిజంగా కోతిని చూసి అలాగే నటించారంటూ తెలిపారు అల్లు అరవింద్. అందుకే ఇప్పటికి అలాంటి పాత్రలు మనందరికీ కూడా గుర్తుండిపోతున్నాయని తెలిపారు.జయకృష్ణ గారి ఇంట్లోనే ఎక్కువగా తన తండ్రితో పాటుగా బాపు గారిని కలిసే వాళ్ళమని తెలిపారు. ఆ రోజుల్లో వారు చాలా మిత్రులుగా కూడా ఉండేవారు అంటూ తెలిపారు అల్లు అరవింద్.

మరింత సమాచారం తెలుసుకోండి: