పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం గబ్బర్ సింగ్ అనే పవర్ఫుల్ స్టైలిష్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది.

ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ... హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభం అయింది. కానీ కొంత కాలం పాటు పవన్ రాజకీయ పనులతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించారు. ఈ మూవీ షూటింగ్ను ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి హరీష్ శంకర్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించాడు. తాజాగా హరీష్ శంకర్ ... ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ తో పాటు అర్ధరాత్రి మ్యూజిక్ సిటింగ్స్ జరుపుతున్నట్లు చెప్పుకొచ్చాడు.

దానితో ఈ మూవీ షూటింగ్ ఓ వైపు జరుగుతూనే ఉండగా , మరో వైపు మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా జెడ్ స్పీడ్ లో ఈ మూవీ పనులను ఈ మూవీ బృందం వారు పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే పవన్ , హరీష్ , దేవి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ఈ సినిమా మరో గబ్బర్ సింగ్ స్థాయి విజయాన్ని అందుకుంటుంది అని పవన్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: