పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల చాలా డిలే అవుతూ రావడంతో ఆయనకు ఉన్న కమిట్మెంట్లతో క్రిష్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి పక్కకు తప్పుకోవడంతో ఈ మూవీ కి సంబంధించిన మిగిలిన షూటింగ్ను జ్యోతి కృష్ణ అనే దర్శకుడు పూర్తి చేశాడు. ఈ మూవీ లో నీది అగర్వాల్ హీరోయిన్గా నటించగా... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఏ ఏం రత్నం ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాను కొంత కాలం క్రితం జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు పెండింగ్లో ఉన్నట్లు, దానితో ఈ మూవీ ని జూన్ 12 వ తేదీన కాకుండా మరో తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొంత కాలం క్రితమే ఈ సినిమాను జూలై 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను  జులై 3 వ తేదీన ఉదయం 11:10 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ పనులు అన్ని ముగిసినట్లు తెలుస్తోంది. దానితో మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ను పవన్ కళ్యాణ్ కు చూపించినట్లు సమాచారం. పవన్ ఈ మూవీ ట్రైలర్ మొత్తం చూసి అదిరిపోయే రేంజ్ లో వచ్చింది అని, ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లోకి వెళితే సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతాయి అని మూవీ బృందానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా పవన్ ఈ సినిమా ట్రైలర్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు వార్తలు బయటకి వస్తూ ఉండటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: