బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ఆమీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి ఇండియా వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరిగా ఆమీర్ "దంగల్" మూవీ తో అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ విహాయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఆమీర్ కొన్ని సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆ మూవీ లు దంగల్ రేంజ్ విజయాన్ని అందుకోలేదు. తాజాగా ఆమీర్ "సితారే జామీన్ పర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆమీర్ తాజాగా రజనీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమాలో చిన్న క్యామియో పాత్రలో నటించాడు. ఈ మూవీ ఆగస్టు 14 వ తేదీన విడుదల కానుంది. ఆమీర్ తన తదుపరి మూవీ ని  లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఆమీర్ ఓ నటుడు మరియు ఓ నటి కుమార్తెకు పేరు పెట్టడానికి హైదరాబాద్ వచ్చాడు. ఇంతకు ఆమీర్ ఎవరి కుమార్తెకు పేరు పెట్టడానికి హైదరాబాద్ వచ్చాడో తెలుసా ..? నటుడు విష్ణు విశాల్ , బ్యాట్మెంటన్ క్రీడాకారిని మరియు నటి అయినటువంటి గుప్తా జ్వాల  కుమార్తెకు పేరు పెట్టడానికి ఆమీర్ ఖాన్ హైదరాబాద్ వచ్చాడు. ఆమీర్ చిన్న పాపకి మీరా అని నామకరణం చేశాడు.

ఇది ఇలా ఉంటే విష్ణు విశాల్ తమిళ్ లో చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి. వాటి ద్వారా ఈయనకు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. గుప్తా జ్వాల బ్యాట్మెంటన్ క్రీడా కారిణిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె కొంత కాలం నితిన్ హీరోగా నటించిన ఓ సినిమాలో చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: