కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అతిథి అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... అశ్విని దత్ , అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ కి చిన్ని కృష్ణ కథను అందించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. 2003 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మొదటగా బన్నీ ని కాకుండా మరో వ్యక్తిని హీరోగా అనుకున్నారట. కానీ ఆ తర్వాత బన్నీ తో ఈ మూవీ ని రూపొందించారట.

కొంత కాలం క్రితం ఈ మూవీ నిర్మాత అయినటువంటి అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఈ సినిమాకు మొదట ఎవరిని హీరోగా అనుకున్నారు అనేది చెప్పాడు. అశ్వినీ దత్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ  ... అల్లు అర్జున్ "గంగోత్రి" సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. కానీ అతని మొదటి సినిమా తేజ దర్శకత్వంలో చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆది క్యాన్సిల్ అయింది. అప్పటికే మేము గంగోత్రి అనే కథను తయారు చేయించాం. ఇక ఆ కథతో రామ్ చరణ్ హీరోగా సినిమా చేస్తే బాగుంటుంది అని చిరంజీవిని సంప్రదించాం. కానీ చిరంజీవి గారు ఇప్పుడే చరణ్ ఎంట్రీ ఉండదు. ఒక సంవత్సరం ఆగాక ఆలోచిద్దాం అన్నాడు.

దానితో మేము గంగోత్రి స్క్రిప్టును పక్కన పెట్టాం. అదే సమయంలో బన్నీ , తేజ కాంబోలో రావలసిన సినిమా ఆగిపోయింది అని నాకు తెలిసింది. దానితో గంగోత్రి కథతో బన్నీ హీరోగా సినిమా చేద్దామా అని రాఘవేంద్రరావు గారిని అడిగాను. దానితో ఆయన చేద్దాం అన్నాడు. ఇక ఆ తర్వాత అల్లు అరవింద్ తో మాట్లాడితే ఆయన కూడా ఓకే అన్నాడు. దానితో గంగోత్రి కథను బన్నీ తో చేసాం అని అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: