పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే హరిహర వీరమల్లు , ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూడు మూవీలకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాలకు కమిట్ అయ్యి కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యాక పవన్ రాజకీయ పనులతో చాలా బిజీ అయ్యాడు. దానితో ఈ మూడు సినిమా పనులను పక్కన పెట్టి రాజాకియాలపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాడు. కొంత కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

దానితో ప్రస్తుతం పవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్య మంత్రి గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రాజకీయ పనులతో చాలా బిజీగా ఉన్న కూడా పవన్  ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలి అనే లక్ష్యంతో పని చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే హరిహర వీరమల్లు , ఓజి సినిమాలను కంప్లీట్ చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్లో ప్రస్తుతం పవన్ పాల్గొంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ...  హరీష్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

గతంలో పవన్ , హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన గబ్బర్ సింగ్ మంచి విజయం సాధించింది. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విడుదల విషయంలో ఈ మూవీ మేకర్స్ గబ్బర్ సింగ్ ఫార్ములాను ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ మూవీ మే నెలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం మే 8 వ విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: