కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.  ఈయన ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. మోహన్ బాబు సినిమాల్లో హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో , కీలకమైన పాత్రలలో , ముఖ్యమైన పాత్రలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే మోహన్ బాబు నట వారసులుగా విష్ణు , మనోజ్ చాలా కాలం క్రితమే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. వీరు చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన అద్భుతమైన గుర్తింపును మాత్రం సంపాదించుకోలేకపోయారు. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు విష్ణు "కన్నప్ప" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మోహన్ బాబు , విష్ణు కలిసి నిర్మించారు.

ఈ సినిమాలో అద్భుతమైన క్రేజ్ కలిగిన ప్రభాస్ , అక్షయ్ కుమార్ , మోహన్ లాల్ , కాజల్ అగర్వాల్ , శరత్ కుమార్ నటించారు. అలాగే ఈ సినిమాలో మోహన్ బాబు కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించినట్లు విష్ణు అనేక సార్లు చెప్పుకొచ్చాడు. కొంత కాలం క్రితమే ఈ సినిమా విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన తర్వాత ఈ సినిమాకు పర్వాలేదు అనే టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ ద్వారా మోహన్ బాబు మరియు విష్ణు కు దాదాపు 100 కోట్ల మేర నష్టం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కూడా మంచు విష్ణు గత సినిమాలతో పోలిస్తే ఈ మూవీ మంచి కలెక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీలోని విష్ణు నటనకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: