
డైరెక్టర్స్ ఎలాంటి సీన్స్ చెప్పినా ..వాళ్ళకి నచ్చితే చేస్తున్నారు లేకపోతే నో అంటూ తెల్చి చెప్తున్నారు. ఎంత హై రెమ్యూనరేషన్ వచ్చినా సరే నో అంటే నో అంటూ తేల్చేస్తున్నారు . రీసెంట్ గా చాలామంది హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేయడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు . మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా.. కీర్తి సురేష్ .. కృత్తి శెట్టి.. ఇలాంటి వాళ్ళు అస్సలు వాళ్ల కమిట్ మెంట్స్ ని పక్కన పెట్టి ఏ పని చేయట్లేదు. ఈ మధ్యకాలంలో రష్మిక మందన్నా వద్దకు ఒక టాప్ డైరెక్టర్ వెళ్లి ..ఐటమ్ సాంగ్ చేయమన్నారట .
మొహమాటం లేకుండా చేతులది దండం పెట్టి సారీ సార్ అంటూ చెప్పేసిందట . అంతకుముందు కీర్తి సురేష్ కూడా ఇలాగే చేసింది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . అంతేకాదు "ఉప్పెన" సినిమా తర్వాత కృతి శెట్టికి కూడా ఐటమ్ సాంగ్ లో నటించమంటూ తెలుగు డైరెక్టర్ అడిగారట . కానీ కృతి శెట్టి అస్సలు ఒప్పుకోలేదట . నిజానికి ముందు వరకు శ్రీలీల కూడా అలానే ఉండింది. కానీ పుష్ప2 సినిమా ఆఫర్ కి టెంప్ట్ అయిపోయింది. కేవలం వీళ్ళే కాదు చాలామంది తెలుగు స్టార్స్ ఐటమ్ సాంగ్ నటించాలి అంటే భయపడిపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్ అంటే ఒక బూతు సాంగ్ అదే బాలీవుడ్ లో అంటే ఒక స్పెషల్ సాంగ్ .. ఆ కారణంగానే చాలామంది తెలుగు ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్ ని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటున్నారు జనాలు..!