సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది నటీ నటులకు అద్భుతమైన డేడికేషన్ను ఉంటుంది. సినిమా కోసం , మూవీbలోని పాత్ర కోసం వారు ఎంత స్థాయికైనా వెళుతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఒక నటుడు సినిమా కోసం , అందులోని తన పాత్ర కోసం అద్భుతమైన స్థాయిలో డెడికేషన్ చూపించి కేవలం 10 రోజుల్లో 10 కిలాల బరువు తగ్గాడు. ఇంతకు ఆ హీరో ఎవరు ..? ఏ దర్శకుడు సినిమా కోసం అంతలా కష్టపడి బరువు తగ్గాడు ..? అనే వివరాలను తెలుసుకుందాం.

తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో శింబు ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ఈయన కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన థగ్ లైఫ్ అనే మూవీ లో కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమాలోని శింబు నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే ఈ నటుడు తన తదుపరి మూవీ ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి వెట్రిమారన్ తో చేయబోతున్నాడు. ఈ మూవీ లో శింబు పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుందట. ఈ పాత్ర కోసం శింబు బరువు తగ్గాల్సి వచ్చిందట. దానితో ఈయన ఎంతో కష్టపడి కేవలం పది రోజుల్లోనే పది కిలాల బరువు తగ్గి వెట్రీమారన్ సినిమాకు పూర్తిగా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇలా ఈయన 10 రోజుల్లోనే 10 కిలాల బరువు తగ్గాడు అనే వార్తలు బయటకు రావడంతో సినిమాపై , ఆయన పాత్రపై ఎంత డెడికేషన్ ఉంటే ఈయన అంత కష్టపడి ఉంటాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: