సినిమా ఇండస్ట్రీ లో దర్శకులు ఎక్కువ శాతం తాము సినిమాకు ఎన్ని కోట్లు పారితోషకం తీసుకున్నాము అనే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకోరు. అందుకు అనేక కారణాలు ఉండి ఉండవచ్చు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే తాము పలానా సినిమాకు ఎన్ని కోట్లు పారితోషకంగా తీసుకున్నాము అని చెబుతూ ఉంటారు. ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న లోకేష్ కనకరాజు తాజాగా కూలీ అనే సినిమాను రూపొందించాడు. రజనీ కాంత్ ఈ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ఆగస్టు 14 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో లోకేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

అందులో భాగంగా తాను కూలీ సినిమా కోసం తాను ఎన్ని కోట్ల పారితోషకం తీసుకున్నాను అనే విషయాన్ని చెప్పడం మాత్రమే కాకుండా ఎందుకు అన్ని కోట్లు పారితోషకంగా పుచ్చుకున్నాను అనే విషయంపై ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చాడు. తాజాగా లోకేష్ మాట్లాడుతూ  ... నేను కూలీ సినిమా కోసం 50 కోట్ల పారితోషకంగా తీసుకున్నాను. అంతగా నేను ఆ సినిమా కోసం పారితోషకం పుచ్చుకోవడానికి ఒక కారణం ఉంది. నేను కూలీ సినిమా కోసం రెండు సంవత్సరాల పూర్తి సమయాన్ని వెచ్చించాను. కూలీ సినిమా చేస్తున్న సమయంలో నేను మరే పని కూడా పెట్టుకోకుండా దీనిపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాను. అందుకే అన్ని కోట్ల పారితోషకం తీసుకున్నాను.

అంత తీసుకోవడం తప్ప ఏమీ కాదు అని నా అభిప్రాయం అని లోకేష్ చెప్పుకొచ్చాడు. ఆఖరుగా లోకేష్ తమిళ నటుడు తలపతి విజయ్ హీరో గా రూపొందిన లియో అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఈ మూవీ ఏకంగా 600 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. మరి కూలీ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Lk