పాపం రవితేజ.. రెండు రోజుల ముందు రీల్ ఫాదర్ ని పోగొట్టుకుంటే ఇప్పుడు రియల్ ఫాదర్ ని పోగొట్టుకున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ గా పాపులారిటి  సంపాదించుకున్న హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది అన్న విషయం అందరికీ తెలిసిందే . రవితేజ తండ్రి గారు భూపతి రాజు రాజగోపాల్ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాని కుటుంబ సభ్యులు ప్రకటించారు.  ఆయన వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు . గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఆయన. అయినా సరే ట్రీట్మెంట్ తీసుకుంటూ హెల్తీగానే ఉన్నారు. కానీ రెండు రోజుల నుంచి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో నిన్న రాత్రి రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు .


రవితేజ తండ్రి భూపతిరాజు రాజగోపాల్ వృత్తి రీత్యా ఫార్మసిస్ట్ . ఆయనకు రవితేజ, రఘు , భరత్ రాజు అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు.  రవితేజ కి  ఆయన తండ్రి అంటే చాలా చాలా ఇష్టం . రవితేజను ఎప్పుడు కూడా మనం నవ్వుతూ అల్లరి చేస్తూ చూసే వాళ్ళం . కానీ ఇప్పుడు మాత్రం రవితేజ  తన తండ్రి పోగొట్టుకున్న బాధలో దుఃఖంలో ఉన్నారు . రవితేజ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు రవితేజ రీల్ ఫాదర్ గా బాగా ఫేమస్ అయిన కోట శ్రీనివాసరావు గారు రెండు రోజుల క్రితమే కన్నుమూశారు .



రవితేజ - కోట శ్రీనివాసరావు తండ్రి కొడుకులు గా ఇడియట్ సినిమాలో ఎంత అద్భుతంగా నటించి మెప్పించారు అన్నది అందరికీ తెలిసిందే . అసలు ఈ సినిమాలో వాళ్ళిద్దరిని చూస్తే నిజంగానే తండ్రి కొడుకులు అనుకునేస్తారు.  అంత బాగా నటించారు.  ఆ సినిమాలో వారి మధ్య బాండింగ్  రియల్ ఫాదర్ అండ్ సన్ లాగే ఉంటుంది. అంతేకాదు రవితేజ కి కోటా శ్రీనివాసరావు అంటే చాలా చాలా గౌరవం . తన తండ్రి కి ఎంత గౌరవం ఇస్తాడో కోటా శ్రీనివాసరావు గారికి కూడా అంతే గౌరవిస్తారు.  కోట మరణం తరువాత  చాలా ఎమోషనల్ గా ట్విట్టర్ వేదికగా కోటా మృటికి సంతాపం తెలియజేశారు.



ఆయన తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  సరిగా ఆయన మరణించిన రెండు రోజులకే ఇలా రియల్ ఫాదర్ భూపతి రాజు రాజగోపాల్ మరణించడం రవితేజకు కోలుకోలేని బాధను మూట కట్టింది.  రవితేజ ఈ బాధ నుంచి కోరుకోవాలి అంటే చాలా టైం పడుతుంది . రవితేజ తొందరగా ఈ బాధ నుంచి బయట పడి మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ కష్ట సమయంలో మీ వెంటే మేమున్నాము అని ధైర్యంగా ఉండాలి అంటూ రవితేజకు ఫ్యాన్స్ మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: