గోల్డ్ స్మగ్లింగ్ కేసులో చిక్కిన కన్నడ నటి రన్యా రావు గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఒక్కసారిగా  ఈ విషయం కన్నడ సినీ పరిశ్రమను ఉలిక్కిపాటికి గురిచేసింది. దీంతో ఈమె వెనక ఎవరెవరు ఉన్నారనే విషయంపై అధికారులు ఆరా తీశారు. ఇందులో కొంతమంది పేర్లు కూడా బయటికి వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా కోర్టు ఈ కేసుకు సంబంధించి తీర్పును తెలియజేసినట్లు తెలుస్తోంది. రన్యా రావు కు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. ఇందుకు సంబంధించి..COFEPOSA సలహా బోర్డు కూడా ఆమోదించింది.


రన్యా రావు తో పాటుగా మరో ఇద్దరినీ నిందితులుగా గుర్తించారు. ఒక ఏడాది పాటు జైలు శిక్ష కాలంలో వీరి ముగ్గురు బెయిల్ కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది. రన్యా రావు సినిమాల విషయానికి వస్తే.. సుదీప్ సరసన మాణిక్య చిత్రంలో నటించిన బాగానే పేరు సంపాదించింది. ఆ తర్వాత దక్షిణాది చిత్రాలలో కూడా నటించింది. వివాహం అనంతరం సినిమాలకు దూరమై.. ఈ ఏడాది మార్చి 3న బెంగళూరులో అంతర్జాతీయ విమానాశ్రయంలో 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ఇంటిలిజెన్స్ అధికారులకు చిక్కిపోయింది.


రన్యా రావు తరచూ అంతర్జాతీయ పర్యటనలు చేస్తూ ఉండడం చేత ఈమె పైన నిగవర్గాలు కూడా దృష్టి పెట్టాయి.మార్చి మూడవ తేదీన రాత్రి దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో బెంగళూరుకు చేరుకున్న తర్వాత ఈమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమె ఒంటినిండా బంగారం ధరించడమే కాకుండా తన దుస్తులలో కూడా బంగారపు కడ్డీలను దాచిపెట్టిన విషయాన్ని అధికారులు గుర్తించారు. రన్యా రావు ఫాదర్ కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి.. వీటిని అడ్డుపెట్టుకొని ఆమె దర్జాగా ఇంటి వద్దకు వెళ్లేదని డిఆర్ఐ అధికారులు తెలిపారు. ఈమెకు సంబంధించి అన్ని ఆస్తులను  అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. సుమారుగా ఈమె పేరు మీద  రూ.34 కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: