- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ సినిమాకు అయినా సరే మల్టీప్లెక్స్ ల లో టికెట్ ధర 200 కు మించకూడదని జీవో ఇచ్చింది. సింగల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ అన్న తేడా లేకుండా గరిష్టంగా టిక్కెట్ ధర 200 కు మించకూడదని చెప్పేసింది. దక్షిణాదిన టికెట్లు ధరలు అధికంగా ఉండే నగరాలలో బెంగళూరు ఒకటి. అక్కడ మల్టీప్లెక్స్ లలో ప్లెక్సీ ప్రైసింగ్ అమల్లో ఉంది. అంటే డిమాండ్ ను బట్టి ఎంతైనా రేటు పెంచుకుంటారు. కొన్ని సినిమాలకు రు. 800 నుంచి 1000 వరకు ఉంది.


మల్టీప్లెక్సుల్లో క్రేజున్న పెద్ద సినిమాలకు 400 మించి రేటు పెట్టాల్సిన సిస్ట‌మ్ అక్క‌డ ఉంది. దీనిపై జ‌నాల నుంచి వ్య‌తిరేకత వ‌చ్చింది. దీంతో ప్ర‌భుత్వం గ‌రిష్టంగా టిక్కెట్ రేటు రు. 200 కు మించ కూడ‌ద‌ని జీవో ఇచ్చేసింది. ఇది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు షాకింగ్ ప‌రిణామంగా చెప్పాలి. ప్రేక్ష‌కుల నుంచి ఈ నిర్ణ‌యం ప‌ట్ల సానుకూల‌త క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే సౌత్ ఇండియాలో మిగిలిన రాష్ట్రాల‌లో టిక్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. తెలంగాణ‌లో టిక్కెట్ రేట్లు మ‌రే రాష్ట్రం అందుకోనంత‌గా ఉన్నాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్ టికెట్ రేటు రూ.295. సింగిల్ స్క్రీన్స్ ధర రూ.150 నుంచి 175 ఉంటోంది. ఏపీలో మల్టీప్లెక్స్ రేటు రూ.180, సింగిల్ స్క్రీన్ టికెట్ ధర సినిమాను బట్టి రూ.112 నుంచి 150 మధ్య ఉంటోంది. ఏపీలో ఓ మోస్త‌రు సినిమాల‌కు కూడా తొలి వారం ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇవ్వ‌డంతో రేట్లు పెరుగుతున్నాయి.


ఇక తెలంగాణలో గత ఏడాది డిసెంబరు వరకు సినిమా క్రేజును బట్టి ఇష్టానుసారం రేట్లు పెంచుకునేవారు. కానీ ‘పుష్ప-2’ తర్వాత బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ నుంచి మళ్లీ అదనపు రేట్లకు అనుమతులు వస్తాయంటున్నారు. ఈ సంగతి పక్కన పెట్టి సౌత్ ఇండియాలో మిగతా రాష్ట్రాల సంగతి చూస్తే.. తాజా జీవో ప్రకారం ఇకపై కర్ణాటకలో మల్టీప్లెక్సుల్లో రేటు రూ.200కు మించదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: