టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన నటిగా కెరియర్ను కొనసాగించిన వారిలో స్నేహ ఒకరు. ఈమె కెరియర్ను ప్రారంభించిన తర్వాత చాలా సినిమాల్లో పద్ధతి గల పాత్రల్లో నటిస్తూ ఎక్కువగా గ్లామర్ షో జోలికి వెళ్లకుండా సినిమాల్లో నటిస్తూ వచ్చింది. దానితో ఈమెకు ఎంతో మంది అభిమానులు పెరిగారు. ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన ఎంతో మంది స్టార్ హీరోలా సినిమాలలో నటించి తన అంద చందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో అనేక సంవత్సరాల పాటు ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగించింది. ఈ మధ్య కాలంలో ఈమె ఎక్కువ శాతం సినిమాల్లో హీరోయిన్గా నటించడం లేదు. ఎక్కువ శాతం సినిమాల్లో ఈమె కీలకమైన పాత్రలలో నటిస్తుంది. కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా రూపొందిన S/O సత్యమూర్తి సినిమాలో ఈమె ఉపేంద్ర కు భార్య పాత్రలో నటించింది. ఇక రామ్ చరణ్ హీరోగా రూపొందిన వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ కు వదిన పాత్రలో నటించింది. ఈమె నటుడు అయినటువంటి ప్రసన్న ను ప్రేమించు పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. మరి వీరి ప్రేమ ప్రయాణం ఎలా మొదలైంది ..? వీరి ప్రేమ చివరకు పెళ్లి వరకు ఎలా చేరుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

స్నేహ , ప్రసన్న ప్రేమ కథ 2009 వ సంవత్సరం విడుదల అయిన అచ్చముండు అచ్చముండు సినిమా సెట్ లో స్టార్ట్ అయ్యిందట. వీరిద్దరూ తరచూ మాట్లాడుకుంటూ ఉండేవారట. ఇక ఆ సమయంలో వీరిద్దరిపై చాలా రూమర్స్ కూడా వచ్చాయి. కానీ అది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని మీరు కొట్టి పారేశారు. వీరు తరచుగా మాట్లాడుకుంటూ ఉండటంతో ప్రసన్న కు స్నేహ పై ప్రేమ ఏర్పడిందట. దానితో స్నేహ ఎవరితోనైనా మాట్లాడితే ప్రసన్నకు చాలా కోపం వచ్చేదట. ఆ తర్వాత వీరు ఇద్దరు కూడా ప్రేమలో పడిపోయి దాదాపు మూడు సంవత్సరాల పాటు డేటింగ్ చేసి 2012 వ సంవత్సరం మే 11 న వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి సంసార జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: