- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్‌ సినిమాగా నిలిచింది 'భాష' సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కంప్లీట్ మాస్ యాక్షన్ సినిమా రెండున్నర దశాబ్దాల క్రితం ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అటు తమిళంతో పాటు, తెలుగు సౌత్ ఇండియాలోని అన్ని భాషలలో సూపర్ డూపర్ హిట్ అయింది . భాషా సినిమా దెబ్బతో రజనీకాంత్ ఇమేజ్ ఆకాశంలోకి వెళ్లిపోయింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తెలుగు డైరెక్టర్ ప్లాన్ చేశాడు. ఈ విషయం చాలా ఆలస్యంగా బయటికి వచ్చింది .


డైరెక్టర్ ఎవరో కాదు నందమూరి' కళ్యాణ్ రామ్' హీరోగా నటించిన 'బింబిసార' సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడుగా పరిచయం కావడంతో పాటు తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. వశిష్ట మల్లిడి ఈ సినిమా తర్వాత ఆయన కెరీర్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలను  తాజా గా జ‌రిగిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. బింబిసార సినిమా ఇచ్చిన సక్సెస్ తర్వాత ఆ తర్వాత సినిమాను ప్రముఖ నిర్మాత 'దిల్ రాజు 'బ్యానర్లో చేయాల్సి ఉందట..


ఈ సినిమాలో హీరోగా తమిళ్ సూపర్ స్టార్ నటించాల్సి ఉందని భాషా సినిమా సీక్వల్ గా ప్లాన్ చేశామని రజనీకాంత్ కు సినిమా కథ కూడా నచ్చిందని కానీ కథలో ఏదో లోటు ఉందని తను భావించానని అందుకే ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదని వశిష్ట తెలిపాడు. ఇలా భాషా సీక్వెల్ చేయాల్సి వచ్చిన ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కకపోవటం పై వశిష్ట క్లారిటీ ఇచ్చాడు..


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: